సచిన్ ను భారతరత్నతో సత్కరించడం ముదావహం: చంద్రబాబు నాయుడు
సచిన్ టెండూల్కర్ యువతరానికి ఆదర్శప్రాయుడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆటలో ఉత్తమ విలువలు, ఉన్నతమైన వ్యక్తిత్వం కారణంగా సచిన్ గొప్ప వ్యక్తిగా మారాడని అన్నారు. సచిన్ ను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించడం ముదావహమని చంద్రబాబు స్పష్టం చేశారు. సచిన్ ను స్ఫూర్తిగా తీసుకుని యువతరం ముందుకు సాగాలని ఆయన సూచించారు. సచిన్ ను గౌరవించడమంటే భారత జాతిని, దేశాన్ని గౌరవించడమని ఆయన అభిప్రాయపడ్డారు.